ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు సరసన రష్మిక నటించింది. విజయశాంతి కీలక పాత్రలో నటించి అలరించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు హిట్ అయ్యాయి. మరోసారి మహేశ్ బాబు కూతురు సితార ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని “మైండ్ బ్లాక్”కి డ్యాన్స్ చేసి మహేశ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. గతంలోనూ ఆమె తన తండ్రి సినిమాల్లోని పాటలకు ఇలా డ్యాన్స్ చేసి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈరోజు గౌతమ్ బర్త్ డే సందర్భంగా ‘‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. మరో ప్రత్యేకమైన రోజు. క్రైమ్‌లో నాతో కలిసి ఉండేవాడు. కానీ.. మొదట దొరికిపోయేది తనే. నా సోదరుడిగా ఉన్నందుకు థ్యాంక్స్. హ్యాపీ బర్త్‌డే’’ అని బర్త్‌డే విషెష్ తెలిపారు.
previous post