telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత వాయుసేనకి అందిన .. తొలి రాఫెల్ .. ట్రైనింగ్ మరియు టెస్టింగ్..

IAF got first rafel fighter plane

తొలి యుద్ధ విమానంను భారత్‌కు అప్పగించింది ఫ్రాన్స్. ఇక విమానం టెయిల్ నెంబర్ ఆర్‌బీ-01 అని ఇచ్చారు. ఆర్‌బీ అంటే ఎయిర్‌మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా పేరు వచ్చేలా ఇచ్చారు. ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, కొత్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. రాఫెల్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారత్‌ ఫ్రాన్స్‌ దేశాల మధ్య కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు యుద్ధవిమానంను నడిపిన తొలి ఐఏఎఫ్ బృందంలో ఈయనొకరుగా ఉన్నారు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో అధికారికంగా అక్టోబర్ 8న చేరనుంది. ఆ సమయంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళతారు.

మే 2020లో మాత్రమే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకుంటాయి. అప్పటిలోగా దీని పనితీరు, వినియోగంపై పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానంను నడపడంలో కొంతమంది పైలట్లు శిక్షణ పొందారు. మొత్తంగా మే 2020 నాటికి 24 మంది పైలట్లకు మూడు బృందాలుగా విడగొట్టి శిక్షణ ఇవ్వనుంది. రాఫెల్ యుద్ధ విమానాలను ఒక స్క్వాడ్రాన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో ఉంచుతుంది. మరో స్క్వాడ్రాన్‌ యుద్ధవిమానాలను పశ్చిమ బెంగాల్‌లోని హషిమరా ఎయిర్‌బేస్‌లో ఉంచుతుంది. సెప్టెంబర్ 2016లో భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వంల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. దీని విలువ 7.8 బిలియన్ యూరోలు.

Related posts