telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాఘవేంద్రరావుకు ఏప్రిల్ 28 వెరీ వెరీ స్పెషల్… ఎందుకంటే…

raghavendra-rao

రాఘవేంద్రరావుకు ఏప్రిల్ 28న వెరీ వెరీ స్పెషల్. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 28న సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఆయన నందమూరి తారక రామారావుతో తొలిసారి ‘అడవి రాముడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో రికార్డులు తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది అడవి రాముడు మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసిన రోజు ఏప్రిల్ 28. ఈ సందర్భంగా అడవిరాముడు సినిమా విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సినిమా నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్స్‌కు ఈ సినిమా దర్శకుడిగా ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు రాఘవేంద్రరావు. అడవి రాముడు సినిమాకు ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ. అలాగే జయప్రద, జయసుధతో ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ మూవీ. ఒక జానపద మూవీని సోషలైజ్ చేసి విజయం సాధించిన మూవీ. ఈ చిత్రం అప్పట్లో 4 కేంద్రాల్లో ఒక యేడాది నడిచింది. 8 సెంటర్లలో 200 రోజులు. 35 సెంటర్లలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి వేటూరి అందించిన సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం.. ఎస్పీ బాలు,సుశీల, గాత్రం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను తిరగరాసిన `బాహుబలి-2` చిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేశారురాఘవేంద్రరావు.

Related posts