telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ ఫలితాల కు ఈవీఎంలే కారణమంటున్న కాంగ్రెస్…

congress flags

ఈ రోజు వెలువడుతున్న బీహార్‌ ఫలితాల్లో ఎన్‌డీఏ భారీ మెజారిటీతో దూసుకెళుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కొంత ఆధిక్యం ప్రదర్శించినా.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ కూటమి పుంజుకుంది. మెజారిటీ మార్క్‌ వైపు దూసుకెళ్లింది. దీంతో ఈవీఎంలలోనే ఏదో మోసం జరిగిందంటూ కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, అంతరిక్షంలోని చంద్రుడు, మార్స్‌ల వద్దనున్న శాటిలైట్లనే నియంత్రిస్తున్నామని, వాటితో పోల్చుకుంటే ఈవీఎంలను హ్యాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ అంటోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి ఎన్డీయే 132 సీట్లలోనూ, మహాఘట్ బంధన్ 99 సీట్లలోనూ, ఎల్‌జేపీ 2  స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 76 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తూ రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా ఏర్పడేందుకు చేరువలో ఉంది. ఇక ఆర్జేడీ 62 సీట్లలో రెండో స్థానంలో, జేడీయూ 51 సీట్ల అధిక్యంతో మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఒక్క చోట కూడా కనీస ఆధిక్యం కూడా సాధించలేకపోతుంది.

Related posts