విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం `వెంకీమామ`. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో కలెక్షన్స్‌ను రాబడుతుంది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరు మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌గా మహేష్ బాబు తన ట్విట్టర్‌లో వెంకీమామ చిత్రంపై ప్రశంసలు కురిపించగా, తాజాగా చిరు వెంకీమామ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇందులో వెంకటేష్, నాగ చైతన్యలు మామ అల్లుళ్ళుగా అదరగొట్టారు. బాబీ తన టేకింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకెళ్ళారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని చిరు అన్నారు. ఈ సందర్బంగా బాబీ, నాగ చైతన్య మెగాస్టార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెంకీ మామ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.
previous post
నైట్ ఫ్రీగా ఉంటావా ? 50 వేలు జీతం ఇస్తా అన్నారు : కరాటే కళ్యాణి