telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీకి మరో షాక్… మాజీ మంత్రి రాజీనామా

TDP-flag

తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 2019 లో అధికారం కోల్పోవడం… అతి తక్కువ సీట్లకే పరిమితమవడం ఆ పార్టీని ఇంకా దెబ్బ తీశాయి. పార్టీ పరిస్థితి చూసి ఒక్కో నేత వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో కీలక నాయకులూ ఉండటం విశేషం.. తాజాగా తెలుగు దేశం పార్టీకి మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి, ఆయన భార్య అనురాధ రాజీనామా చేశారు. మాట కూడా చెప్పకుండా రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించడంపై మనస్థాపం చెందారు. నిన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అనురాధ ఉన్నారు. పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను పదవి నుంచి తప్పించే సమయంలో కనీసం మాట కూడా చెప్పలేదని లేఖలో అనురాధ వాపోయారు. గతంలో నెల్లూరు మున్సిపల్ చైర్మన్ గా, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు నిర్వర్తించారు.

Related posts