telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అభినందన్ విడుదల వాయిదా .. నేటి సాయంత్రానికి..!

pak unfair negotiations on pilet release

ఎంతో ఆశగా సరిహద్దులలో భారత్ పైలెట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ, పాక్ మాత్రం ఇంకా కల్లబొల్లి మాటలు చెప్పడం మనటంలేదు. కోర్టు కేసు అని సాయంత్రానికి వాయిదా వేశారు, ఇక పాక్ పార్లమెంట్ లో రైల్వే మంత్రి అసలు అభినందన్ ను విడుదల చేసే అవసరం ఏంటన్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎన్నికల సందర్భంగా తమపై ఈ దాడి చేసి, ఉగ్రవాదులపై దాడిగా అభివర్ణిస్తున్నారని ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు భారత పైలెట్ ను విడిచిపెడితే మోడీ మళ్ళీ దాడికి దిగారనే నమ్మకం ఏమిటని ఆయన అనవసర కాలయాపన చేసేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేశాడు.

ఇవన్నీ చూస్తుంటే, పాక్ మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నట్టే తోస్తుంది. భారత సైన్యం అన్నివిధాలా సన్నద్ధంగా ఉంటేనే మంచిదని ఇంటెలిజెన్స్ కూడా నివేదికలు ఇస్తుంది.తాజాగా, భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ఈరోజు విడుదల చేసేందుకు పాకిస్థాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా కొందరు పాకిస్థానీలు అడ్డుపుల్లలు వేసేందుకు ప్రయత్నించారు. లాహోర్ హైకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు.

తాజాగా లాహోర్ హైకోర్టు అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ కు ఎలాంటి విచారణ అర్హత లేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అభినందన్ విడుదలపై కొనసాగుతున్న మిస్టరీ వీడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాఘా-అట్టారి బోర్డర్ లో అభినందన్ ను పాక్ సైన్యం భారత్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Related posts