telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ లోదుస్తులు బయటపడితే వాటిని చూసి సిగ్గుపడకండి : ప్రముఖ నటి రాధికా మదన్

Radhika-madan

భారతదేశంలోని ప్రతీ ఆడపిల్ల ఒళ్లంతా కప్పుకుని దుస్తులు వేసుకోవాలి. లేకపోతే అదో పెద్ద పాపంలా చూస్తారు. పెద్దలు అలా చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే మన జాగ్రత్త కోసమే వారు ఇలాంటివన్నీ చెప్తుంటారు. ప్రముఖ నటి రాధికా మదన్ కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నారు. ఆమె లోదస్తులకు సంబంధించిన ఓ క్యాంపెయిన్కు సపోర్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాధికా మదన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇది 2020. ప్రతీ విషయంలో మహిళలు ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ ఏ మహిళలనైతే పొడుగుతున్నారో అదే మహిళ లోదుస్తులు బయటికి కనిపించేలా వేసుకుంటే నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు వేసుకునే దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే రోజుల పోయాయి. వాళ్లు ఎలాంటి దుస్తుల్లో సౌకర్యంగా ఫీలవుతారో అలాంటి దుస్తులనే వేసుకోనివ్వాలి’ ‘ ఓసారి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అది పెద్ద పాపం అనుకుని నేను సిగ్గుతో ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పాలని ఉంది. నేను అందరు ఆడపిల్లలకు ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. మీ లోదుస్తులు బయటపడితే వాటిని చూసి సిగ్గుపడకండి. అది కేవలం మీ మానాన్ని కాపాడుకోవడానికి వేసుకునే దుస్తులే తప్ప మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేవి కావు’’ అని తెలిపారు.

Related posts