ప్రస్తుతం కరోనా కారణంగా విలువైన కాలాన్ని నష్టపోయామన్నారు ఇస్రో చైర్మన్ శివన్… నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. అన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేవపెట్టిన తర్వాత షార్ కేంద్రంలో సంబరాల్లో మునిగిపోయారు శాస్త్రవేత్తలు.. ఒకరినొకరు అభినందించుకుంటూ.. ఉత్సాహంగా గడిపారు.. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ప్రసంగించిన ఇస్రో చైర్మన్.. ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం అని ఆనందాన్ని వ్యక్తం చేశారు… ఇక, కోవిడ్ కారణంగా విలువైన కాలాన్ని నష్టపోయామన్న ఇస్రో చైర్మన్… తక్కువ మంది సిబ్బందితో పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించారు. మరో నాలుగు ప్రయోగాలు త్వరలోనే ఉంటాయని ప్రకటించారు. పీఎస్‌ఎల్వీ-సీ50, జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10లను త్వరలోనే ప్రయోగిస్తామని వెల్లడించారు.
previous post
next post
విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణం: చంద్రబాబు