telugu navyamedia
సినిమా వార్తలు

నయనతార “సైరా”కూ దూరమేనా ?

Syeraa

లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం నయనతార దూరంగా ఉంటుంది. సినిమాకు సంతకం చేసే సమయంలోనే ఈ మేరకు కండీషన్ పెడుతుంది. “సైరా”కు మాత్రం నయన్ మినహాయింపునిచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. “సైరా” ప్రమోషన్ కార్యక్రమాలకు నయనతార హాజరవుతుందని అనుకున్నారు. అయితే “సైరా”కు కూడా నయన్ పాత పద్ధతినే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన “సైరా” టీజర్ లాంఛ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైనా నయనతార మాత్రం రాలేదు. అయితే చెన్నైలోజరుగబోయే ప్రమోషన్ కార్యక్రమాలకైనా నయనతార హాజరుకావాలని చిత్రబృందం కోరుకుంటోందట. మరి అప్పుడైనా నయనతార హాజరవుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts