telugu navyamedia
సినిమా వార్తలు

56 సంవత్సరాల “రాము”

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు గారు నటించిన సూపర్ హిట్ సాంఘిక చిత్రం ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి “రాము” 04-05-1968 విడుదలయ్యింది.

నిర్మాతలు ఎం.మురుగన్,ఎం.శరవణన్,ఎం.కుమరన్ లు ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు
ఏ. సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: జావర్ సీతారామన్, మాటలు: డి.వి.నరసరాజు, సంగీతం: ఆర్.గోవర్ధనం, పాటలు: ఆరుద్ర, కొసరాజు, దాశరథి , ఛాయా గ్రహణం: డి.రాజగోపాల్, కళ: ఏ.కె.శేఖర్, నృత్యం: ఏ.కె.చోప్రా, ఎడిటింగ్: ఆర్.జి.గోపు, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జమున, పుష్పలత, రేలంగి, రాజనాల, పద్మనాభం ,రమణారెడ్డి, నాగయ్య , సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎస్.వి.రంగారావు, మాస్టర్ రాజకుమార్, పెరుమాళ్ళు, గీతాంజలి, సూర్యాకాంతం, తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు ఆర్.గోవర్ధనం సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు హిట్ అయ్యాయి.
“పచ్చని చెట్టు ఒకటీ, వెచ్చని చిలకలు రెండూ”
“మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము ”
“మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే,
మాటలురాని కోయిలమ్మ కూయునులే”
“రా..రా.. కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడ రా..రా.. కృష్ణయ్యా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టకున్నాయి.

ఈ సినిమా ద్వారా కొత్తగా తెలుగు తెరకు పరిచయం అయిన పుష్పలత గారు మొదటసారి గా ఎన్టీఆర్ తో జతగా నటించారు. తర్వాత పుష్పలత చాలా సినిమాలలో ఎన్టీఆర్ గారికి తల్లి పాత్రలు వేశారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఫుల్ లెంగ్త్ ట్రాజెడీ పాత్రను పోషించారు. కాగా అప్పటివరకు ఎన్టీఆర్ గారు నటించిన జానపద, సాంఘిక చిత్రాలలో హీరోయిన్ లతో డ్యుయేట్ సాంగ్స్, హుషారైన పాటలతో సరదాగా జాలీగా ఉండేవి.

కానీ ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారికి ఒక్కడ్యూయెట్ లేకుండా, విషాద గీతాలతో, విషాద సన్నివేశాలతో పాటు కేవలం లాల్చీ పైజామా డ్రెస్ తో ఎన్టీఆర్ ఈ సినిమా లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.

ఈవిథంగా విషాద సన్నివేశాలు, విషాద గీతాలతో కూడా సినిమాలను విజయవంతం చేయడం ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం అని ఈ చిత్రం మరొకసారి నిరూపించింది..

ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి, మొత్తం 15 కేంద్రాలలో 100 రోజులు ఆడి శతదినోత్సవం జరుపుకున్నది.

2 కేంద్రాల్లో (విజయవాడ,గుంటూరు) 25 వారాలు కు పైగా ప్రదర్శింపబడి సిల్వర్ జూబ్లీ జరుపుకున్నది.
విజయవాడ – దుర్గాకళామందిర్ లో ఏక ధాటిగా 181 రోజులు ఆడింది.

1968 లో సిల్వర్ జూబ్లీ (175 రోజులు) ఆడిన ఏకైక సినిమా “రాము”. ఈ చిత్రం ఘనవిజయం సాధించి ఆ ఏడాది విడుదలైన సినిమాలలో మేటి చిత్రంగా అగ్రస్థానం పొందింది.
100 రోజులు ఆడిన కేంద్రాలు:-
(1)విజయవాడ — దుర్గ కళామందిరం (181 రోజులు),
(2) గుంటూరు — నాజ్ అప్సర (లేట్ రిలీజ్)
(3)తెనాలి — స్వరాజ్
(4)గుడివాడ — శరత్
(5)మచిలీపట్నం — బృందావన్
(6)కాకినాడ — క్రౌన్
(7)రాజమండ్రి — నాగదేవి
(8)తణుకు — నరేంద్ర చిత్రమందిర్
(9)నెల్లూరు — రంగమహల్
(10)అమలాపురం — కమలేశ్వర
(11)తిరుపతి — జ్యోతి
(12)కర్నూల్ — చాంద్
(13)ఏలూరు — రమా మహల్
(14)విశాఖపట్నం – ప్రభాత
(15)హైదరాబాద్ — దీపక్ మహల్ (104 రోజులు)- {లేట్ రిలీజ్}.

రజతోత్సవ కేంద్రాలు:-
1. విజయవాడ — దుర్గాకళామందిరం, (181 రోజులు)
2. గుంటూరు — నాజ్ అప్సర + శ్రీ వేంకటేశ్వర (175 రోజులు) [లేట్ రిలీజ్] రజతోత్సవం జరుపుకున్నది…

Related posts