మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్ గొడవలు, అల్లర్లు, గ్లామర్ షోలతో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఇక తాజాగా కెప్టెన్ రేసులో గంగవ్వ ఉండటం ఆసక్తికరంగా మారింది. ముందు జైలు నుండి నోయల్ బయటకు వచ్చేశాడు. ఉక్కు హృదయం టాస్క్‌లో ది బెస్ట్ ప్రదర్శన ఇచ్చిన వారిలో నుండి ఎంపిక అయిన నలుగురికి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇక కెప్టెన్సీ టాస్క్ రంగు పడుద్దిలో భాగంగా గంగవ్వ, అభిజిత్, హారిక మరియు అవినాష్ లుకు కలర్ నీటితో నిండి ఉన్న బౌల్ ను ఇవ్వడం జరిగింది. ఆ బౌల్ లో నీటిని కింద పోకుండా చూసుకోవాలి. అయితే ఈ టాస్క్ లో అందరు గంగవ్వ కలర్ బౌల్ ను కాపాడారు. అవినాష్ కు కుమార్ సాయి మద్దతుగా నిలువగా మిగిలిన వారు అంతా కూడా గంగవ్వకు మద్దతుగా నిలిచారు. దాంతో ఈజీగానే గంగవ్వ కెప్టెన్ అయ్యింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చింది. స్వాతిని ఇంప్రెస్ చేయమని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు చెప్పడంతో హౌస్‌లోని జెంట్స్ అందరూ పోటీపడ్డారు. వీరిలో అమ్మరాజశేఖర్, నోయల్, అఖిల్, అవినాష్ ఆమెను ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ఇంప్రెస్ చేసిన వారితో కలిసి స్వాతి స్పెషల్ పార్టీ చేసుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో వారానికో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నడుస్తోంది. మొదటి వారం కమెడియన్, నటుడు కుమార్ సాయి హౌస్‌లో అడుగు పెట్టగా రెండో వారం అవినాష్ ఇంట్లోకి వచ్చి చేరాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్‌లో ప్రవేశించింది. వస్తూ వస్తూనే అబ్బాయిలకు సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది.
previous post
next post
ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్