telugu navyamedia
సినిమా వార్తలు

గురు తుల్యులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు..

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు. లెజండ్రీ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయనతో దిగిన ఓ పాత ఫోటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. ” గురు తుల్యులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు..

తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం.. మీ చిత్రాలు అ జరా మ రం.. మీ దర్శకత్వం లో నటించడం నా అదృష్టమ‌ని చిరంజీవి తెలిపారు.

మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

కె.విశ్వనాథ్ దర్వకత్వంలో వ‌చ్చిన శుభలేఖ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మొదటి సారిగా  నటించారు. చిరంజీవికి జోడిగా సుమలత ఈ సినిమాలో నటించింది.

ఆ తర్వాత విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. దాంతో అప్ప‌టినుంచి మెగాస్టార్ కు విశ్వనాథ్ కు గౌరవం అభిమానం పెరుగుతూ వ‌చ్చింది..

Related posts