telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : స్టార్ హీరో కూతురు ఫోటో

Yash

కన్నడ స్టార్ హీరో యష్ “కేజిఎఫ్” చిత్రంతో తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో “కేజిఎఫ్ చాప్టర్-2″లో నటిస్తున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో తన కూతురు ఫోటోని అభిమానుల కోసం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ ఫోటో చూసిన అభిమానులు యష్ కూతురు ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంగళవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ లో తన కూతురు ఫోటోను యష్ షేర్ చేయగా… కొన్ని గంటల్లోనే లక్షల లైక్ లు, షేర్లు లభించాయి. తన కుమార్తెకి ఇంకా పేరు పెట్టలేదని, ప్రేక్షకుల ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉండాలని యష్ అభిమానులను కోరారు.

Related posts