telugu navyamedia
సినిమా వార్తలు

ఆ బడ్జెట్ లోనే సినిమా చేశాం..- చైత‌న్య

అక్కినేని నాగార్జున , అక్కినేని నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చి న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సిక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో నాగార్జున‌కు జ‌గ‌తా ర‌మ్మ‌కృష్ణ‌, నాగచైతన్యకు జ‌త‌గా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. జీ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Naga Chaitanya and Nagarjuna begin filming for Bangarraju : Bollywood News  - Bollywood Hungama

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా  చైతన్య మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ప‌లు కీల‌క విష‌యాలుపై స్పందించారు.

గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో  తీవ్రమైన చర్చ జరుగుతన్న సంగతి తెలిసిందే.  సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది.

Nagarjuna, Naga Chaitanya Are Confident Bangarraju Will Be A Success,  Reveal It Is A "Proper Sankranthi Festival Film

తాజాగా బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా  చైతూకు టికెట్స్ రేట్స్ విషయం పై మీడియా వారు ప్రశ్నించారు . దానికి  నాగాచైతన్య స్పందించాడు.. సినిమా టికెట్ ధరల గురించి నాన్నతో చాలాసార్లు చర్చలు జరిగాయి. టికెట్ ధరల విషయంలో గతేడాది ఏప్రిల్ 8న ఏపీలో జీవో వచ్చిందనుకుంటున్నాను. మేం బంగార్రాజు షూటింగ్ ఆగస్టు నెలలో స్టార్ట్ చేశాం. అప్పట్లో ఉన్న టికెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ బడ్జెట్ లో ఈ సినిమా చేశాం. భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెరిగితే మనకు బోనస్ అవుతుందని నాన్న అన్నారు.

థ్యాంక్యూ సినిమా అంటే నిర్మాత దిల్ రాజు గారు చూసుకుంటారు. నేను సినిమా చేసేముందు నిర్మాతతో మాట్లాడతాను. వారికి దానితో సమస్య లేకపోతే నాకు కూడా లేదు.ఇక రాజకీయపరమైన నిర్ణయాలకు విభిన్నమైన కారణాలు ఉండొచ్చు. నేను అందుకు వ్యతిరేకం కాదు. ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్లాలి అంటూ తెలివిగా స‌మాధానం ఇచ్చాడు.

Related posts