telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐస్ బాత్ చేసి… మూత్రం తాగిన ప్రముఖ పాప్ స్టార్

Madonna

ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ మడోన్నా టీ కప్పులో తన మూత్రాన్ని తాగుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 61 ఏళ్ల వయసులోనూ మడోన్నా రోజూ కచేరీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఐదు నిమిషాలు పాట పాడినా వేల కొద్ది డాలర్లు కుమ్మరించడానికి చాలా మంది స్పాన్సరర్లు సిద్ధంగా ఉన్నారు. కొన్ని కోట్ల డాలర్లు డబ్బులు సంపాదించిన మడోన్నాకు ఓ విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే.. ఆమె కచేరీ కార్యక్రమాలు ముగిశాక తెల్లవారు జామున 3 గంటలకు నిద్రలేచి ఐస్ బాత్ చేస్తారు. బాత్ టబ్‌లో ఐస్ ముక్కలు వేసుకుని అందులో కాసేపు కూర్చుంటారు. అలా చేస్తే దెబ్బలు నయమవుతాయన్నది ఆమె నమ్మకం. అలా తన స్నేహితుడితో కలిసి ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐస్ బాత్ చేస్తూ తన స్నేహితుడతో బాక్సింగ్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఐస్ బాత్ అయ్యాక టీ కప్పులో తన మూత్రాన్ని తాగుతూ కనిపించారు. ‘ఐస్ బాత్ చేసిన వెంటనే మన మూత్రం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది’ అని చెప్పారు. తన మూత్రం తనకు నేచురల్ మెడిసిన్‌లా పనిచేస్తుందని మడోన్నా చెబుతుంటారు. మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఈ పద్ధతిని నమ్ముతారు. 1978లో దేశాయ్.. అమెరికన్ జర్నలిస్ట్ అయిన డ్యాన్ రాదర్‌తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన 60 నిమిషాల పాటు యూరిన్ థెరపీ గురించి వివరించారు. చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేనివారికి మూత్ర వైద్యం ఎంతో ఉపయోగపడుతుందని, అన్ని రోగాలు నయమైపోతాయని తెలిపారు.

Related posts