telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏపీలో వ‌డ‌గాల్పులు.. 12 గంట‌ల‌కే  44 డిగ్రీలు! 

temp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్టా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. సోమవారం మ‌ధ్యాహ్నం వరకు న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలనుఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ రోజు  12 గంట‌ల‌కే రాష్ట్రంలో 44 డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌త‌లు చేరుకున్నాయి. సాయంత్రం మూడు గంట‌ల‌కు 47 డిగ్రీలు దాటే సూచ‌న‌లున్నాయని ఆర్టీజీఎస్ పేర్కొంది.

అత్య‌ధికంగా ప్ర‌కాశం జిల్లా కారంచేడులో 44.67 డిగ్రీలు నమోదు కాగా, త్రిపురాంత‌కంలో 44.02 డిగ్రీలు న‌మోదు అయ్యాయి. గుంటూరు జిల్లా అమృత‌లూరులో 44.15, నెల్లూరు జిల్లా చిట్ట‌మూరు 44.10, ప‌శ్చిమ గోదావరి తాడేప‌ల్లిగూడెం 43.96 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి. వ‌డ‌గాల్పులు తీవ్రత ఎక్కువ‌గా ఉంటుందని, ప్ర‌జ‌లు ఎండ‌ల్లో తిర‌గ‌కుండా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆర్టీజీఎస్ సూచించింది.

Related posts