telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేటీఆర్ కి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు

KTR

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. కేటీఆర్‌తో దిగిన ఓ ఫొటోని షేర్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ‘డియర్ తారక్ హ్యాపీ బర్త్‌డే…మీరు నిరు పేదలకు అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్లడం, సాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు మరిన్ని సంవత్సరాలు ఇలా ప్రజలకు సేవ కొనసాగించాలని, అందుకు కావలసి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరు పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కి కేటీఆర్ స్పందించారు.’ధన్యవాదాలు సార్ ‘ అంటూ బదులిచ్చారు. చిరంజీవికి, కేసీఆర్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి ఇండస్ట్రీకి లభించిన మహానటుడు అంటూ కేసీఆర్ పలు వేదికలపై ప్రశంసించారు. కరోనా సమయంలో ఇండస్ట్రీ సమస్యలు వివరించి షూటింగ్ లకు అనుమతించాలని చిరంజీవి తన బృందంతో కలసి కేసీఆర్ ను కలవగా ఆయన ఘన స్వాగతం పలికారు. షూటింగ్ లకు వెంటనే అనుమతించారు. ఇక కేటీఆర్ అయితే పవన్ కళ్యాణ్, చరణ్ లతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా హాజరై చిరు, పవన్ ల గురించి గొప్పగా మాట్లాడి ఫ్యాన్స్ ను కేరింతలు కొట్టించారు.

Related posts