telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బాల్క సుమన్ ఇంట విషాదం : సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి

Balka suman trs

చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట విషాదం నెలకొంది. బాల్క సుమన్ తండ్రి మృతి చెందారు. బాల్క సుమన్ తండ్రి మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అయితే బాల్క సురేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన సురేశ్, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్ ను సీఎం ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts