పాక్ కబంద హస్తాల నుండి ఇంత త్వరగా వెనక్కి రాగలిగింది అభినందన్ మాత్రమేనేమో.. ఇంతగా పాక్ ఎప్పుడూ ఒక భారతీయుడు చిక్కితే వదిలిపెట్టలేదు. కానీ ఈ సారి తప్పలేదు ఆ దేశానికి. ప్రత్యేక విమానంలో భారత పైలెట్ అభినందన్ ను సరిహద్దులకు తరలించింది పాక్. నిన్నటి నుండి ఉత్కంఠతో అతడి కోసం ఒక దేశం అంటే 130 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. ఆతడి రాకతో వారందరూ ఆనందోత్సాహాలలో ఉన్నారు. అయినా జరిగింది మరిచిపోలేదు. వచ్చిన వాడు ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, తనను పాక్ ఎంత వరకు హింసించిందో(దానికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంది) తెలుసుకోవాల్సి ఉంది. అంతా బాగుంటే సరే, లేదంటే పాక్ పై తీవ్రమైన చర్యలు తప్పవు మరి.
ఏదిఏమైనా పాక్ నుండి విడుదలైనందుకు అతడి కుటుంబం సహా, యావత్ దేశం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మరోపక్క వాయుసేన తమ ధీరుడైన కమాండర్ ను తనివితీరా చూసుకున్నారు. అతడు కోలుకున్నాక బహుశా మీడియా ముందుకు తీసుకురావచ్చు. అయితే మనవాడు తిరిగి వచ్చేశాడు కాబట్టి, ఇక పాక్ పై భారత్ చర్య ఏమిటి అనేది వేచి చూడాల్సిన అంశం.