telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

యాపిల్ కంపెనీ వల్లే “గే” అయ్యానంటూ కేసు…!?

Apple

యాపిల్ సంస్థ కారణంగా తాను గేగా మారానని కోర్టులో కేసు వేసిన రష్యాకు చెందిన రజుమిలవ్ అనే వ్యక్తి తన కేసును వెనక్కు తీసుకున్నాడు. యాపిల్ సంస్థపై కేసు వేసిన నాటి నుంచి తన క్లైంట్‌ను సోషల్‌మీడియా ద్వారా యాపిల్ మద్దతుదారులు, ఇతరులు ఏడిపిస్తున్నారంటూ రజుమిలవ్ తరపు న్యాయవాది గుస్నీవా గురువారం కోర్టుకు తెలిపింది. ఈ కారణంగా తాము కేసులో ముందుకు వెళ్లదలుచుకోలేదని, కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గురువారం కోర్టులో హాజరైన యాపిల్ సంస్థ ప్రతినిధి దీనిపై స్పందించకుండానే వెళ్లిపోయారు. కాగా, యాపిల్ సంస్థ కారణంగా తాను గేగా అయ్యానని రజుమిలవ్ కొద్ది రోజుల క్రితం కోర్టులో కేసు వేశాడు. తన యాపిల్ ఫోన్‌లోని ఓ యాప్ ద్వారా బిట్‌కాయిన్లను ఆర్డర్ చేస్తే.. తనకు ‘గే కాయిన్’ అనే వేరే కరెన్సీ వచ్చినట్టు రజుమిలవ్ చెప్పాడు. దీనివల్ల తన గర్ల్‌ఫ్రెండ్‌తో తెగదెంపులు జరిగాయని, ఆ తర్వాత ఓ మగవ్యక్తితో సంబంధం పెరిగిందని, అతడి వల్ల నలుగురిలో తన పరువు పోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో యాపిల్ కంపెనీ వల్లే తాను గేగా తయారయ్యానని, దీనికి కారణమైన యాపిల్ సంస్థ తనకు పది లక్షల రబుల్స్(రూ. 11 లక్షలకు పైగా) ఇవ్వాలంటూ కోర్టుకెక్కాడు.

Related posts