telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉగ్రమూకలకు పాక్ నిధులు సమకూరుస్తూనే ఉంది .. అమెరికా కంట్రీ రిపోర్ట్స్..

trump intermediate on india and pakistan

అమెరికా ఉగ్రవాదంపై పాక్ ఎటువంటి చర్యలకు పూనుకోకపోగా, నిధులు మంజూరు చేస్తున్నట్టు బట్టబయలు చేసింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపు విషయంలో పాకిస్థాన్‌ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని అమెరికాకు చెందిన ‘కంట్రీ రిపోర్ట్స్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ -2018’ నివేదిక బట్టబయలు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రసంస్థలను పరిధుల్లో పెట్టడంలో పాక్‌ విఫలమైందని చీవాట్లు పెట్టింది. యువతను ఉగ్రవాదంలోకి లాగడం, వారికి అందులోకి నియమించుకోవడాన్ని పాక్‌ ఆపలేకపోయిందని మొట్టికాయలు వేసింది.

ఈ నివేదిక ప్రకారం.. పాక్‌ గడ్డపై అఫ్గాన్ తాలిబన్లు, హఖ్ఖానీ నెట్‌వర్క్‌ల విజృంభనలపై నిషేధం విధించడంలో పాక్‌ ఎంత మాత్ర ప్రభావం చూపలేకపోయింది. ఆర్థిక చర్యల కార్యదళం సిఫార్సులనూ పక్కన పెట్టి అంతర్జాతీయ సమాజ విశ్వాసాన్ని పోగొట్టుకుంది. ఐరాస చెప్పిన నిబంధనలను తుంగలో తొక్కింది. ఓ వైపు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే తాలిబన్లకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారుస్తోంది. వారిద్వారా అమెరికా, అఫ్గానిస్థాన్‌ సైన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఇక పాక్‌లోని జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా నిధుల సేకరణను ఆపలేకపోతోంది. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలకు చెందిన కొందరిని పాక్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఇక ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 2018లోనే ఎక్కువ సంఖ్యలో ఉగ్రదాడులు జరిగాయని ఆ నివేదిక తెలిపింది.

Related posts