telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్‌ “చక్ర” నుంచి సర్ ఫ్రైజ్ గ్లింప్స్‌..

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‌ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఈ మూవీ యాక్ష‌న్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం కావ‌డం విశేషం. అయితే.. తాాజాగా ఈ సినిమా నుంచి  ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. 

 

Related posts