సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాఖి ఖన్నా ప్రధాన పాత్రలలో మారుతి తెరకెక్కించిన చిత్రం “ప్రతి రోజు పండగే”. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిన్నటితో చిత్ర షూటింగ్ పూర్తైంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేసి డిసెంబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “యూ ఆర్ మై హై” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు