telugu navyamedia
రాజకీయ వార్తలు

లడఖ్ కు మోదీ వరాల జల్లు..!

narendra-modi

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా లడఖ్ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వరాలను ప్రకటించారు. లడఖ్ లో తొలి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మోదీ పచ్చజెండా ఊపారు.

లడఖ్ ప్రాంతంలో ఓ బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కూడా మోదీ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్ మినహా మిగతా అన్ని బేసిక్ సైన్సెస్ తదితర కోర్సుల్లో డిగ్రీలను అందిస్తుంది. ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అధికారికంగా ప్రతిపాదన తెస్తుందని అధికారులు తెలిపారు. ఆపై క్యాబినెట్ ఆమోదం తరువాత బిల్లు పార్లమెంట్ మందుకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

లడఖ్ ప్రాంతంలో గడచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధాని, ఈ సమావేశంలోనే కొత్త వర్శిటీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts