అమెరికన్ టెలివిజన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క షో వల్ల ఇందులో నటించిన వారికి హాలీవుడ్ స్టార్ల కంటే రెట్టింపు పాపులారిటీ దక్కింది. ఈ సిరీస్‌లో నటించినవారిలో ఎమీలియా క్లార్క్ అనే నటి కూడా ఉన్నారు. తాను కీలక పాత్రలో నటించిన ఈ షో హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తన చేత బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపజేసినందుకు బాధపడ్డానని తెలిపారు. ఈ విషయాన్ని ‘ఆర్మ్ ఛైర్ ఎక్స్‌పర్ట్’ అనే షోలో ఎమీలియా వెల్లడించారు. ‘అవసరం లేని చోట నా చేత దుస్తులన్నీ విప్పించారు. సెట్‌లో ఈ విషయంలో రోజూ నాకు డైరెక్టర్స్‌కి మధ్య గొడవలు జరుగుతుండేవి. దుస్తులు విప్పనని నేను లేదు విప్పాల్సిందేనని డైరెక్టర్స్ వాదులాడుకునేవాళ్లం. నేను నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని చెప్పేవారు. దాంతో ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేది. ఎందుకంటే అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి దుస్తులు విప్పాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఎందుకు నాచేత అలా చేయించారో వారికే తెలియాలి. అలా నేను ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫస్ట్ సీజన్‌లో నేను చాలా నగ్న సన్నివేశాల్లో నటించాను’ అంటూ బాధపడ్డారు ఎమీలియా.
previous post