ప్రస్తుతం సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం అనేది సాధారణంగా మారిపోయింది. అభిమానులు తమ స్టార్స్ కు సోషల్ మీడియాలో ఖాతాలు ఉంటే వారికి దగ్గరైనట్లుగా భావిస్తారు. చాలా మంది సినీ తారలు తమ అభిప్రాయాలని, విశేషాలని పంచుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ విషయంలో రాంచరణ్ కాస్త వెనకబడ్డాడనే చెప్పొచ్చు. రాంచరణ్ ఇప్పటివరకు కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో చరణ్ కు అకౌంట్ లేదు. ఎట్టకేలకు చరణ్ మరో ముందడుగు వేసి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించాడు. కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన చరణ్ కు అప్పుడే 13 వేలమందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. “రంగస్థలం” చిత్రంలోని గడ్డం లుక్ తో చరణ్ తొలి పోస్ట్ పెట్టాడు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీనితో ఇన్స్టాగ్రామ్ లోకి అభిమానులు రాంచరణ్ కు గ్రాండ్ గా స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం రాంచరణ్ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
previous post
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం