telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇకపై అక్కడ షూటింగులో వాళ్ళు కూడా పాల్గొంటారు…!

Shooting

కరోనా విలయతాండవం చేస్తుండడంతో లాక్ డౌన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలూ సినిమా హాళ్లు, షూటింగులకు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల టీవీ, సినిమా షూటింగులకు ఒక్కో రాష్ట్రం అనుమతులిస్తూ వచ్చింది. ఇక అనుమతి లభించడంతో కొంతమంది షూటింగుల్లో పాల్గొని కరోనా బారిన పడ్డారు కూడా. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లకు పైబడిన నటీనటులకు టీవీ, సినిమాల్లో నటించడానికి అనుమతినిచ్చింది. గతంలో కరోనా విజృంభణ కారణంగా సీనియర్ సిటిజన్లు, చిన్నపిల్లలు షూటింగ్ లలో పాల్గొనటానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రమోద్‌ పాండే అనే సీనియర్‌ నటుడు జూలై 21 హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ ముంబై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఒక సీనియర్ సిటిజన్ రోజంతా దుకాణం తెరుచుకుని కూర్చున్నప్పుడు 65 ఏళ్ళు ఉన్నవారు ఏ ప్రాతిపదికన షూటింగ్ లకు వెళ్లకూడదని ప్రశ్నించింది. ఇది నటులపై వివక్ష లాగా ఉందని హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సైతం షూటింగ్ లో పాల్గొనటానికి అనుమతినిచ్చింది.

Related posts