ఇంత బాధని భరిస్తూ బ్రతకలేకపోతున్నా..!
ఇన్ని బంధాలు, బాధ్యతలు మరిచి చావలేకపోతున్నా..!!
ఇన్నిరోజుల విరహాన్ని నీకు వివరించలేకపోతున్నా..!
నిన్ను మరిచి ముందుకు అడుగువేయలేకపోతున్నా..!!
నన్ను మరణించేవరకు మర్చిపోను అన్న మాటను మరవలేకపోతున్నా..!
మరిచావని నా మరణం కోసం ఎదురుచూస్తున్నా..!!
నువ్వు వేరయ్యాక నా వేదనను వ్యక్తపరచలేకపోతున్నా..!
నా మనసులోనుండి నిన్ను వెలివేయలేకపోతున్నా..!!
కలలో ఉన్న నువ్వు కనుమరుగైతావేమోనని కనుతెరువలేకపోతున్నా..!
తెరిచాక నీ తలపుల్లో తడిసిపోయి మళ్ళీ మూయలేకపోతున్నా..!!
ఎవరైనా చూసి ఎగతాలి చేస్తారేమోనని ఏడవలేకపోతున్నా..!
నాకెందుకొచ్చిన గొడవ అని ఎవరినీ ఎదురించలేకపోతున్నా..!!
నిన్ను తప్ప వేరే ఎవరిని చూడలేకపోతున్నా..!
చూసినా అది నువ్వు కాదని కలవరపడుతున్నా..!!
అనుక్షణం నీ ఆలోచనలను ఆపలేకపోతున్నా..!
అనుదినం నీ ఊసు లేకుండా ఉండలేకపోతున్నా..!!
రాతలు రాయలేకపోతున్నా..!
చేతలు చేయలేకపోతున్నా..!!
మాటలు ఆడలేకపోతున్నా..!
నా మనసులో గీసిన నీ రూపాన్ని
నా చేతులతో చెరపలేకపోతున్నా..!!!!
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స