telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క‌పిల్ దేవ్ బర్త్ డే సందర్భంగా “83” నుంచి వీడియో

83

1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిల‌వ‌గా, ఆ సక్సెస్ స్టోరీ ఆధారంగా “83” మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక.. రోమి దేవ్ అనే పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా కనిపించ‌నుంది. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ… రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ రోజు క‌పిల్ దేవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా 83 చిత్ర మేకింగ్‌కి సంబంధించిన ప‌లు ఫోటోలు విడుద‌ల చేశారు మేక‌ర్స్. అంతేకాదు కపిల్ దేవ్ మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Related posts