పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన తాజా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా నామకరణం జరగలేదు. పవన్ ఈ సినిమాతో పాటుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్‌ను కూడా రూపొందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే విరూపాక్ష, హరహర వీరమల్లు, ఓం శివమ్ అంటూ అనేక పేర్లు ప్రచారం అయ్యాయి. కానీ ఈ సినిమా పేరు విషయంలో అధికారిక ప్రకటన ఒక్కటి కూడా రాలేదు. అయితే మూవీ మేకర్స్ ఎట్టకేలకు సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు అని తెలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి11 విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా 17వ శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పిరియాడికల్ సినిమా. ఇందులో పవన్ ఓ దొంగ పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.
previous post
అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్