telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆదిపురుష్ కోసం విలువిద్య నేర్చుకుంటున్న ప్రభాస్…

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీత్ డైరెక్టన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సలార్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. అంతేకాకుండా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను ఓకే చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా… రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రభాస్ తన లుక్స్‌లో మార్పు తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. అలాగే రాముడు ఆయుధం విల్లు కాబట్టి ప్రభాస్ కూడా ప్రస్తుతం విలువిద్య ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ అభిమానులు ఆదిపరుష్ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండనున్నాయిని ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts