telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్ బాల్ తగిలి అంపైర్ జాన్ విలియమ్స్ మృతి

Umpire-John-Williams

ప్రముఖ అంపైర్ జాన్ విలియమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. గత నెల 13వ తేదీన ట్రిలీట్ లో పెంబ్రోక్, నార్బెర్త్ జట్ల మధ్య డివిజన్ 2 మ్యాచ్ జరుగగా, ఓ ఆటగాడు కొట్టిన బంతి బలంగా విలియమ్స్ తలకు తాకింది. దీంతో మ్యాచ్ నిలిపివేసిన మేనేజ్ మెంట్, ఆయన్ను కార్డిఫ్ లోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయిన ఆయన, నిన్న తుదిశ్వాస విడిచారు.

బంతి బలంగా తగలడంతో విలియమ్స్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో 80 సంవత్సరాల వయసులో ఉన్న వివిలియమ్స్ కు నరాలు చికిత్సకు స్పందించలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విలియమ్స్ మృతి విషయాన్ని వెల్లడించిన పెంబ్రోక్ క్రికెట్ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపింది.

Related posts