telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు అడుగు జాడల్లో ఈ కుట్రలు జరుగుతున్నాయి..

Devineni kodali

ఏపీ మంత్రి కొడాలి నాని తన పై వస్తున్న పేకాట ఆరోపణల పై స్పందించారు. సంక్రాంతి పండుగ లోపు ధాన్యం సేకరణ బకాయిలు అన్ని పూర్తి చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. 29 బస్తాల కంటే ఎక్కువ పంట పండినా కొనుగోలు చేయమని సీఎం చెప్పారు. రెండు రోజులుగా గుళ్ళ వివాదాలు జరుగుతున్నాయి. చంద్రబాబు అడుగు జాడల్లో ఈ కుట్రలు జరుగుతున్నాయి అని అన్నారు. కొన్ని పిచ్చి కుక్కలను రోడ్ల మీదకు వదిలాడు. దేవినేని ఉమ బ్రోతల్ హౌస్ నడిపే వాడు. గుడివాడలో పేకాట క్లబ్బులను మా పోలీసులు వచ్చి పట్టుకున్నారు విజయవాడ, గుంటూరులో క్లబ్బులు నడిపేవారు. 1200 మంది బ్రోకర్లు ఉండేవారు. వచ్చే డబ్బులు లోకేష్ కు వెళ్లి ఇచ్చేవాడు నేనే పేకాట నడిపితే మా పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అని అన్నారు. మేము చేయమంటేనే రైడ్ లు జరిగాయి. కొనగళ్ళ నారాయణ ఇంట్లో పేకాట క్లబ్బులు నడిపేవారు. పేకాట ఆడేవారు రోజుకొక చోటు మారుస్తూ ఆడుతున్నారు. వీటి వెనుక చంద్రబాబు ఉన్నా బయటకు తెస్తా. నా అనుచరులు పేకాటలో ఉంటే ఏమవుతుంది… ఉరిశిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. పెనాల్టీ కడతారు బయటకు వచ్చి మళ్ళీ ఆడుతున్నారు. అందుకే చట్టాల్లో మార్పు తీసుకుని వస్తున్నాం. ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు వ్యక్తిగత పనులను ఎప్పుడూ అభ్యర్థించలేదు. ఎప్పుడూ అడగను… నేనేంటో గుడివాడ ప్రజలకు తెలుసు అని కొడాలి పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts