telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్య వివాదం పై క్లారిటీ ఇచ్చిన ఆ యువ హీరో…

సేహారి చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ లో నటుడు, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తీరు సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో హర్ష్ కనుమిల్లి ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. అయితే, ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ మ్యానరిజంపై సోషల్ మీడియాలో వెటకారం మొదలైపోయింది. హీరో హర్ష్‌పై బాలకృష్ణ చేయి చేసుకున్నారని, నిర్మాత అద్వయపై ఆగ్రహం వ్యక్తం చేశారని, తన ఫోన్‌ను బాలయ్య విసిరి కొట్టారని మీమ్స్ సోషల్ మీడియాలో హల్ ‌చల్ చేశాయి. కానీ, హర్ష్‌పై బాలయ్య చేయి చేసుకోలేదు. ఈ విషయాన్ని హర్ష్ స్వయంగా వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక విర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న హర్ష్.. బాలయ్యపై మొదలైన మీమ్స్ గురించి వివరణ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు తాను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకున్నానని, అందుకుని ఆ చేయి మీద బాలయ్య చిన్నగా కొట్టి కుడి చేతితో పట్టుకోమని చెప్పారని, ఈ మాత్రం దానికి రకరకాల సౌండ్లతో మీమ్స్ వచ్చేశాయని హర్ష్ వివరించారు. అలాగే, బాలయ్య ఫోన్ విసిరిన ఘటనపై కూడా హర్ష్ స్పందించారు. ‘‘కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు బాలయ్య తన కళ్లద్దాలు తీసి అసిస్టెంట్‌ పైకి విసిరారు. ఆయన పట్టుకున్నాడు. కరెక్ట్‌గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసే సమయంలో ఫోన్ రావడంతో దాన్ని కూడా తన అసిస్టెంట్ పట్టుకుంటాడనే ఆయన విసిరినట్టున్నారు’’ అని వివరణ ఇచ్చారు. అయితే అది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన పని కాదు అని, బాలయ్య చాలా మంచి వారు అని, కార్యక్రమానికి రావాలని కోరిన వెంటనే ఒప్పుకున్నారు అని తెలిపారు.

Related posts