telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్ మరో పథకం.. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు

cm jagan ycp

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరో పథకం తీసుకువచ్చింది. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని వెల్లడించింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు నకళ్లతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందిని తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునేవారికి కొన్ని విధివిధానాలు, అర్హతలు రూపొందించారు. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఒకవేళ తానొక్కడికే అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతులతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే బోర్లు ఉన్న పొలాలను ఈ ఉచిత పథకం నుంచి మినహాయించారు.

Related posts