telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పొలం పనికి వెళ్తున్న శర్వానంద్… “శ్రీకారం” ఫస్ట్ లుక్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ సినిమా ‘శ్రీకారం’. సోమవారం ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ‘ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’.. అంటూ శర్వా పొలంలో నడుస్తున్న లుక్ రిలీజ్ చేశారు. గల్లచొక్కా, లుంగీతో పక్కా పల్లెటూరి రైతు కుర్రాడిలా కనిపిస్తున్నాడు శర్వా. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు.

Srikaram

Related posts