telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానులకు మహేష్ బాబు రిక్వెస్ట్

mahesh-babu

ఈ నెల 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఓ ముఖ్యమైన పోస్ట్ చేశాడు. “ప్రియమైన అభిమానులకు… మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తోన్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తోన్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేష్ బాబు” అని పోస్ట్ చేశాడు.

Related posts