యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా ముందు అనుకున్న బడ్జెట్, తర్వాత బడ్జెట్ మారిపోయింది. ఇంత భారీ బడ్జెట్ పెట్టే కమ్రంలో నిర్మాతలకు ఓ సందర్భంలో ఒత్తిడి ఎదురైంది. అప్పుడు అటు ప్రభాస్.. ఇటు యు.వి.క్రియేషన్స్‌కు మంచి మిత్రుడైన రామ్‌చరణ్ అండగా నిలిచి, ఆర్ధికంగా సపోర్ట్ చేశారని వార్తలు వినపడుతున్నాయి. అందుకు నిర్మాతలు “సాహో” లాభాల్లో వాటా తీసుకోమని ప్రపోజల్ పెట్టారట. దానికి చరణ్ కూడా ఓకే అన్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వినిపిస్తోన్న ఈ వార్తలపై అటు “సాహో” టీంగానీ, ఇటు చరణ్ టీంగానీ స్పందించలేదు.
“ఆపమ్మా కొంచెం… నీకు బోర్ కొట్టట్లా…” ఫోటోగ్రాఫర్పై మహేష్ పంచ్