నటి కాజల్‌కు ఓ అభిమాని వివాహం చేసుకోవాలని ప్రపోజ్ చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా నటిస్తున్న కాజల్ అప్పుడప్పుడూ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో కలిసి చాట్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన అభిమానులతో చాటింగ్ చేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది.
ఆ సమయంలో కాజల్‌ను ఓ అభిమాని.. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు ఒకే చెబితే వివాహం చేసుకుంటానని చాట్ చేశాడు. దీంతో అవాక్కైన కాజల్ కొంతసేపటి తరువాత తేరుకుని ‘ప్రయత్నించండి. అయితే అది అంత ఈజీ కాదు’ అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆనందపడిపోయిన ఆ అభిమాని ప్రయత్నిస్తానని తిరిగి సమాధానమిచ్చాడు.