telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

కీలక ఘట్టంలో .. పీఎస్‌ఎల్వీ-సీ47 … మరికాసేపటిలో నింగిలోకి..

pslv-c47 ready to launch by isro

ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌లోను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ల్యాంచ్‌ ప్యాడ్‌ దీనికి వేదిక కానుంది. దీనికి సంబంధించిన 26 గంటల కౌంట్‌డౌన్‌ మంగళవారం ఉదయం గం. 7:28 గంటలకు ప్రారంభమైంది. నవంబర్ 27, బుధవారం, ఉదయం గం.9.28 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రోదసీలోకి దీన్ని పంపనుంది. ఈ రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలనూ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ47 ద్వారా ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచనుంది ఇస్రో.

సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని ప్రయోగిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉంది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు. కార్టోశాట్-3 ఉపగ్రహం జీవిత కాలం ఐదేళ్లు కాగా.. బరువు 1625 కిలోలు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.350కోట్లు ఖర్చయింది. దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేసే ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరి కొద్దిసేపట్లో నింగిలోకి పంపనుంది.

Related posts