చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలా కూతలా చేసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా తమ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం చైనా అని అమెరికా బలంగా నమ్ముతోంది. చైనాపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించింది. ఆ దేశానికీ చెందిన అనేక కంపెనీలపై ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నది. అగ్రదేశం అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుంచి చైనా కంపెనీలకు డిలిస్టింగ్ చేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. హోల్డింగ్ ఫారెన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంలో అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంతో విఫలమైతే వాటిని స్టాక్ ఎక్స్చేంజి నుంచి డీలిస్ట్ చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. అమెరికాలో కార్యకలాపాలు సాగించే చైనా కంపెనీలు చైనా దేశం యొక్క నియంత్రణ ఏమి లేదని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా పబ్లిక్ కంపెనీల ఖాతాలను తనిఖీలు చేసే బోర్డుకు చైనా కంపెనీల ఖాతాలను కూడా తనిఖీలు చేపట్టే వెసులుబాటు ఈ చట్టం ద్వారా వస్తుంది. దీంతో ఎప్పుడైనా సరే సదరు బోర్డులు ఆయా చైనా కంపెనీల ఖాతాలను తనిఖీలు చెయ్యొచ్చు. తేడా వస్తే స్టాక్ ఎక్స్చేంజిల నుంచి డీలిస్టింగ్ చెయ్యొచ్చు. చూడాలి మరి ఈ నిర్ణయం పై చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేది.
previous post
next post