telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పొగడ్తలు..

తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా..తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పొగడ్తల వర్షం కురిపించింది. ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్ గా‌ నిలిచింది. తెలంగాణ గ్రామపంచాయ‌తీల పనితీరును కేంద్రం పరిశీలిస్తూ, తెలంగాణ ఆన్‌లైన్‌​ ఆడిట్ విధానంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. దేశంలోనే తెలంగాణ 25% గ్రామపంచాయతీల‌లో ఆన్‌లైన్‌ ఆడిట్ పూర్తి చేశారని కేంద్ర పంచాయ‌తీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరి కేఎస్ సేథి ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలు ఈ మాదిరిగా స‌మ‌న్వ‌యం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో మరో 25% గ్రామ‌పంచాయ‌తీల‌ను ఆన్‌లైన్ ఆడిట్ చేయాల‌ని కేంద్ర జాయింట్ సెక్ర‌ట‌రీ కోరారు. అన్ని ర‌కాలుగా ఆన్‌లైన్ ఆడిట్‌లో దేశంలోనే తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని కేంద్ర పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శ ప్ర‌శంసించారు. ఇతర రాష్ట్రాలు ఇంకా ఆడిట్ ప్రారంభ‌ దశలోనే ఉన్నాయని, కానీ తెలంగాణలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు గాను 25 శాతం గ్రామపంచాయతీల (3,225) లు ఆడిట్ ఆన్‌లైన్‌కి ఎంపిక చేసి ఆడిట్ పూర్తి చేశారన్నారు.

Related posts