కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలంతా ఇంట్లోని పనులు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు. సినిమాలు లేక ఖాళీగా ఉండడంతో శ్రీమతులకి సాయంగా ఉండేందుకు గరిటె పట్టి వెరైటీ వంటకాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన ఫ్యామిలీ కోసం మటన్ బిర్యానీ చేశాడు. లంచ్‌లో దీనిని టేస్ట్ చేసిన కరీనా, కరీష్మాలు అద్భుతంగా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కరీష్మా కపూర్ తన సోషల్ మీడియాలో సైఫ్ వండిన మటన్ బిర్యానీ ఫోటో షేర్ చేసింది. చెఫ్ సైసైఫ్ అద్బుతంగా మటన్ బిర్యానీ చేశారు. లంచ్ బాగుంది అని ఫోటోకి కామెంట్ పెట్టి ఈద్ ముబారక్ అని విషెస్ తెలిపింది. ఆదివారం రోజు సైఫ్ వండిన మటన్ బిర్యానీతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఫుల్‌గా ఎంజాయ్ చేసింది.
previous post