telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ మాఫియా విశ్వ ప్రయత్నం… కలుగులో నుంచి బయటకు… : కంగనా రనౌత్

kangana

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై, నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నేరుగా ఆమె చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే తనను అణగదొక్కేందుకు బాలీవుడ్ మాఫియా విశ్వ ప్రయత్నం చేస్తోందని కంగనా ఇటీవలే ఆరోపించింది. కంగనకు వ్యతిరేకంగా “బాయ్‌కాట్ కంగన” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ విషయంపై కంగనా స్పందించింది. “అద్భుతం. ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. ‘బాయ్‌కాట్ కంగన’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ మాఫియా తను చేయగలిగింది చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని కంగనా ట్వీట్ చేసింది. కాగా ఇటీవల తన ట్విటర్ ఖాతాను కూడా నిలిపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది జరిగే లోపే కొందరి వ్యవహరాలను బయటపెడతానని కంగనా పేర్కొన్న విషయం తెలిసిందే.

Related posts