telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రూలర్” ఫస్ట్ సాంగ్… ” అడుగడుగో యాక్షన్ హీరో”

Ruler

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ‌రుపుకుంటుంది. మరో 19 రోజుల‌లో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా చిత్రం నుండి అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ భాస్క‌రుని ఆల‌పించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts