telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ “పుష్ప”లో యాంకర్ సుమ కీలకపాత్ర ?

Suma

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- లెక్కల మాస్టర్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఈ మూవీలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మొదటిసారిగా జత కట్టబోతోంది. జగపతి బాబు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ యాంకర్ సుమ నటించబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఇందులో బన్నీ సోదరి పాత్రకు గానూ దర్శకుడు సుకుమార్ సుమను సంప్రదించారని, అందుకు ఆమె ఓకే చెప్పిందని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts