telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా.. కర్మ కర్మ.. దోపిడీకి గురవడం ఖర్మ

కర్మ కర్మ కరోనా కర్మ
వైరస్ తో బాధ పడేవారిది ఖర్మ
కరోనా తెచ్చిన చైనాది కర్మ
అనుభవించే మిగతా దేశాలది ఖర్మ
హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లేకపోవడం కర్మ
అది అందక ప్రాణాలు పోయినవారిది ఖర్మ
బెడ్ లు అందుబాటులో ఉండకపోవడం కర్మ
ట్రీట్మెంట్ సరిగ్గా అందని వారిది ఖర్మ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల లేమి కర్మ
ప్రైవేటు హాస్పిటల్స్ లో దోపిడీకి గురవడం ఖర్మ
వ్యాక్సిన్ తక్కువ ఉత్పత్తి చేయడం కర్మ
దొరకక తంటాలు పడడం ప్రజల ఖర్మ
తక్కువ వ్యాక్సిన్ లతో సెంటర్ ఉండడం కర్మ
తీరా కష్టపడి వెళితే లేకపోవడం వారి ఖర్మ
**
ఆనాటి బోఫోర్స్ కుంభకోణం ఖత్రోచి కర్మ
నష్టపోయిన దేశప్రజలది ఖర్మ
వారెన్ అండర్సన్ భోపాల్ గ్యాస్ లీక్ కర్మ
ఇప్పటికీ బాధపడుతున్న వారిది ఖర్మ
చోక్సీ బంగారం వజ్రాల వ్యాపారం కర్మ
మోసపోయిన ఖాతాదారులది ఖర్మ
విజయ్ మాల్యా రుణాలు ఎగ్గొట్టడం కర్మ
లబోదిబోమంటున్న బ్యాంకు లది ఖర్మ
నీరద్ మోదీ విదేశాలకెళ్ళడం కర్మ
అప్పు తీరేదెలా అని తలలు పట్టుకున్నవారిది ఖర్మ
మాజీ మంత్రి నెలకు వంద కోట్ల వసూలు కర్మ
శిక్ష పొందిన పోలీసుఅధికారులది ఖర్మ
నిన్న ట్రంపు చేసిన తెంపరిపనులు కర్మ
అన్ని విధాలా బాధలు పడిన పౌరులది ఖర్మ
గెలిచాక పార్టీలు మారి ప్రజలను మరవడం కర్మ
గెలిపించిన ఓటరు బతుకులు మారకపోవడం ఖర్మ
“కర్మణ్యేవాధికారస్య”గీతోపదేశమే మన కర్మ
అయినా కర్మ ఫలితం ఆశిస్తే అది మీ ఖర్మ

Related posts