telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా టైమ్ లో ఈ పండ్లతో మంచి ఫలితాలు

ఉసిరికాయ : 
ఉసిరికాయలోని విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఆకలి పుట్టిస్తుంది. మలబద్దకాన్ని పొగొట్టును. గుండెకి మేలుచేస్తుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. దగ్గు, ఉబ్బసం, క్షయ , దప్పిక , మూత్రవిసర్జనలో మంట , శుక్రంనష్టం , దృష్టిమాంద్యం పోగొట్టును . వ్యాధినిరోధక శక్తిని పెంచును. నరాలబలహీనత , గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడును. ఇది కంటి లొపల ఒత్తిడిని తగ్గించి కంటిచూపును కాపాడును. రక్తపోటు , డయాబెటిస్ కు విరుగుడుగా పనిచేయును . తగుపాళ్లలో కలిపిన ఉసిరికాయపొడి , కాకరకాయపొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకున్నప్పుడు చక్కెరవ్యాధికి ఇది దివ్యౌషధముగా పనిచేయును .
* పైనాపిల్ –
పైనాపిల్ లో పుష్కలంగా క్లోరైన్ ఉంటుంది. మూత్రపిండాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది దివ్యఔషధముగా పనిచేయును . పైనాపిల్ జ్యూస్ నులిపురుగులను బయటకి పంపించివేస్తుంది. గుండెకి కూడా చాలా మంచిది .
* పుచ్చకాయ –
పుచ్చకాయలో 96 % నీరు ఉంటుంది. ప్రొటీన్లు , పిండిపదార్దాలు , ఖనిజలవణాలు , క్యాల్షియం , ఫాస్ఫరస్ , ఐరన్ లభ్యమగును. వేసవికాలంలో దాహాన్ని తీర్చి చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయల వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయ తిన్నా లేదా రసం తాగినా రక్తం శుద్ది అగును. రక్తహీనత కూడా తగ్గును. నిద్రపట్టక బాధపడేవారికి , హిస్టీరియా , ఉన్మాదం వంటి జబ్బులతో బాధపడేవారికి పుచ్చకాయ దివ్యఔషధముగా పనిచేయును .
జ్వరం తగ్గాక పుచ్చకాయ రసం ఇస్తే త్వరగా కోలుకొంటారు. మూత్రసంబంధ వ్యాధులకు డీహైడ్రేషన్ సమస్యకు పుచ్చకాయ రసం తాగడమే పరిష్కారం. రోగాలను కలిగించే వివిధ రకాల సూక్ష్మజీవులను నాశనం చేయడమే కాకుండా గజ్జి , తామర వంటి రోగాలను కూడా తగ్గించును . భోజనం తరువాత మాత్రమే పుచ్చకాయను తినాలి. పరగడుపున తినకూడదు. పుచ్చకాయను తిన్నవెంటనే నీటిని తాగకూడదు.
* బొప్పాయిపండు –
రక్తవిరేచనాలకు , ఎసిడిటి , మలబద్దకానికి , ఆకలి మందగించినవారికి ఇది మంచి ఔషదం . ఇందులో ఉండే కెరొటిన్ , విటమిన్ A , C ల వల్ల రేచీకటి తగ్గును. కొంచంసేపు చదివినను కండ్లనుండి నీరు రావటం , కండ్లు లాగడం , మసకగా కనిపించడం సమస్యలతో బాధపడేవారు ప్రతినిత్యం బొప్పాయి తినడం వలన ఈ బాధలు అన్నియు తొలగిపోవును . బొప్పాయి అరుగుదలకు చాలా మంచిది . బొప్పాయి చర్మంపైన ముడతలు పడనివ్వదు. బొప్పాయిలో ఉండే పపైన్ చర్మం పైన ఉండే మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేయును . ఫలితంగా వృద్ధాప్యఛాయలు రానివ్వదు. రోజుకు 200 మి.లీ బొప్పాయిరసం తాగితే శరీరశుద్ధికి చాలా ఉపయోగపడును. కేన్సర్ కి ఇది మంచి మందు. ఆస్థమారోగులకు ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇందులో ఉన్న ఎంజైములు ముఖ్యముగా పురుష లైంగిక శక్తికి ఆర్జినైన్ , గుండెశక్తికి కారెపైన్ , మరియు రక్తం గడ్డకట్టడానికి ఫైబ్రిన్ ఉపయోగపడును.
రేగిపండు –
ఇది మలబద్దకాన్ని పొగొట్టును. శరీరంలో మంటని పొగొట్టును. రక్తశుద్ధికి ఉపయోగపడును. ఇందులో విటమిన్ C తో పాటు ఇతర ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది .
* ఖర్జురము –
గుండెకు మేలుచేస్తుంది. క్షయ , కడుపుబ్బరం , వాంతి , జ్వరం , విరేచనాలు , దప్పిక , దగ్గు , ఉబ్బసం , మూర్చ నివారణకు తోడ్పడుతుంది.
* కమలాపండు –
కమలాపండు నుండి విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచును. అందువల్ల తరుచుగా జలుబు , దగ్గు , జ్వరం వంటి రోగాలు రావు . ముఖ్యంగా కొందరు ఎప్పుడూ జలుబుతో బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం రోగనిరోధకశక్తి తగ్గడమే . అందువల్ల సిట్రస్ జాతికి చెందిన కమలా , నిమ్మ, జామకాయ , నారింజ వంటి పళ్ళను ఎక్కువుగా తీసుకోవాలి . కమలారసం తీసుకోగానే రక్తం వెంటనే గ్రహిస్తుంది. కాబట్టి వెంటనే ఫలితం కనిపిస్తుంది. అందుకే నీరసంగా ఉన్నవారు , బలహీనులు కమలాపళ్ళు తినటం లేదా కమలారసం తాగడం చేస్తే వెంటనే శక్తి , ఉత్సాహం పుంజుకుంటుంది.
గుండెజబ్బులు , మలబద్దకం , జలుబు , ఆస్తమా , బ్రోన్కైటీస్ తో బాధపడువారు కమలాపళ్లు తీసుకొనుచున్న చక్కటి ఉపశమనం లభించును. రోగనిరోధకశక్తి గణనీయముగా పెరుగును . దీనిలోని C విటమిన్, కాల్షియం కీళ్లనొప్పులతో బాధపడేవారికి , మెనోపాజ్ కి దగ్గరలో ఉండు స్త్రీలకు మంచిమందుగా పనిచేయును . ఒక కమలాపండు తింటే 60 కెలరీల శక్తి వచ్చును. నిద్రలేమితో బాధపడేవారు , రాత్రిపడుకునే ముందు ఒక కమలా పండు తినవలెను . హాయిగా నిద్రపడుతుంది. కమలాపండు మంచి జీర్ణకారిగా పనిచేయును .
* జామపండు –
ఉదర సంబంధ సమస్యలకు , జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకు జామపండు చాలా మంచిది . రక్తశుద్దికి ఇది బాగా ఉపయోగపడును. మలబద్దకాన్ని నివారిస్తుంది. జామ ఆకులు నమిలితే దంతాలకు సంబంధించిన వ్యాధులు తగ్గును.

Related posts