139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయిందని తెలిపారు డీసీపీ అవినాష్ మహంతి. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించమని..ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని..ఈ కేసులో ప్రమేయం ఉన్నా వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును మహిళా ఏసీ పిస్తా అధికారులతో విచారణ జరుపుతున్నాము అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశామని..టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశామని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి.
previous post
next post